What is the role of Vitamin D in boosting the immune system?

#VitaminD #immunesystem

ఎండలోకి వెళ్లినప్పుడు మన శరీరం సూర్యరశ్మిలోని UV కిరణాల ద్వారా చర్మం కింద గల కొలెస్టరాల్ విటమిన్ Dగా తయారవుతుంది. ఇది సహజసిద్ధ ప్రక్రియ. ఇందుకుగాను మన ఋషులు సూర్యనమస్కారాలు పేరుతో దిశను నిర్దేశించారు. మారిన జీవనశైలి కారణంగా కనీస ఎండ పొడ తగలకుండా… ఏసీ, చీకటి గదుల్లో గడిపేస్తున్నవారే ఎక్కువ. దాంతో చాలామందిలో ఇప్పుడు విటమిన్‌ డి లోపం కనిపిస్తోంది. వర్షాకాలం, శీతకాలంలో సూర్యరశ్మి తగ్గడం వల్లా కొందరిలో ఇది లోపిస్తుంది. శారీరీక శ్రమ తక్కువ చేసేవారిలోనూ ఇది లోపిస్తోంది. ప్రపంచంలో 80% మంది డి-విటమిన్ లోపంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక తెలుపుతోంది. ఈ విటమిన్‌ సరైన మోతాదులో శరీరానికి అందినప్పుడే రోగనిరోధకశక్తి పెంపొందుతుంది.
D vitamin ఎందుకు అవసరం?
రోజూ కనీసం 400 ఇంటర్నేషనల్‌ యూనిట్ల విటమిన్‌ డి మన శరీరానికి అవసరం. ఇది ప్రధానంగా సూర్యరశ్మి నుంచి అందుతుంది. దాంతో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాల్లోనూ ఇది లభిస్తుంది. కొవ్వులో కరిగే ఈ విటమిన్‌. క్యాల్షియం, ఫాస్ఫరస్‌లను శరీరం గ్రహించడానికి ఉపయోగపడుతుంది. ఈ రెండూ ఎముక నిర్మాణానికి కావాల్సిన అత్యావశ్యక మూలకాలు. అందుకే ఎముకలు, దంతాల అభివృద్ధికి ఈ విటమిన్‌ అవసరం. క్యాన్సర్‌ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది. వాపులను తగ్గిస్తుందని కొన్ని ప్రయోగ పరిశోధనలు చెబుతున్నాయి. రోగకారక క్రిములతో పోరాడే టీ-కణాలు, రోగనిరోధక కణాల పనితీరును విటమిన్‌-డి మెరుగుపరుస్తుంది. గుండె జబ్బులను తగ్గిస్తుంది. బరువు నియంత్రణకు సాయపడుతుంది.